– ఎస్పీ నీతికా పంత్

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నీతికా పంత్ అన్నారు. సోమవారం వాంకిడి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం డబ్బు ఇతర నిషేధ వస్తువులు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని అన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ ఉన్నారు.