వేద న్యూస్, నర్సంపేట:

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన ఈర్ల రాజు ను బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి గా నియమిస్తున్నట్టు ఆ సంఘం  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ , నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్  తెలిపారు.

ఈ మేరకు రాజుకు గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల రాజు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను గుర్తించి యువజన సంఘం జిల్లా కార్యదర్శి గా నియమించిన డ్యాగల శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఈర్ల రాజు వెల్లడించారు. బీసీ యువజన సంఘం బలోపేతానికి పని చేస్తానని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నీల సుధాకర్, దుగ్గొండి మండల నాయకులు కొలిపాక సుధాకర్, కోల అజయ్, రాజేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.