- గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు
వేద న్యూస్, వరంగల్:
అది స్వయంగా సంబంధిత శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం.. అందులో మహిళా మంత్రి.., ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితురాలు అయిన నాయకురాలు ఆమె.. ములుగు ఎమ్మెల్యే అయిన సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న.. సెగ్మెంట్ పరిధిలోనే గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు అందడం గమనార్హం.!
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలోఅంగన్ వాడి సిబ్బంది గర్భిణులు , బాలింతలకు కుళ్ళిన కోడిగుడ్లు పంపిణి చేశారు. అయితే ఆ సంగతి సదరు మహిళలు..ఇంటికి వెళ్లి చూడగా తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నది.
గర్భిణులు, బాలింతలు తినే ఆహారం కూడా నాణ్యంగా అందించలేరా? అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.