వేద న్యూస్, జమ్మికుంట:

మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్”  కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి  పిలుపునిచ్చారు.

సోమవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గ, జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కమిటీని ప్రకటించారు. నియామాకపు ఉత్తర్వులు అందజేశారు.

హుజురాబాద్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నకీర్త రాజు ను, జమ్మికుంట మండల ఉపాద్యక్షునిగా పేరవేని రమేష్ , ఇల్లంతకుంట మండల సహాయ కార్యదర్శిగా గుడికందుల రాజయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కార్యక్రమములో ఆరే.రమేష్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి పాకాల మల్లారెడ్డి, గురుకుంట్ల రాజీరు, ముత్యాల రమేష్, పెరవేన .కుమార్ యాదవ్ మిల్కూరి మల్లారెడ్డి తధితరులు పాల్గొన్నారు.