• ఆధారాలు చూపని నగదు జప్తు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీస్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో డబ్బులు, మద్యం రవాణా చేస్తే సీజ్ చేస్తామని ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు.

ఒక వ్యక్తి వద్ద 50 వేల నగదుకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు ఎస్‌ఐ అనిల్ కుమార్ సూచించారు.