వేద న్యూస్,కాసిపేట:

మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల నిర్వాహక యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలో కాసిపేటలో సర్పంచ్ అభ్యర్థులతో సమన్వయ సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాలు తెలియజేశారు.
ఈ సమావేశంలో మందమర్రి సీఐ, శశిధర్ రెడ్డి ఎమ్మార్వో సునీల్ దేస్ పాండే, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ , ఎంపీవో సప్తర్ అలీ కాసిపేట, ఎన్నికల వ్యయ పర్యవేక్షక బృందం, దేవాపూర్ ఎస్‌ఐ పాల్గొన్నారు. అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై విస్తృతంగా వివరించారు.
అధికారులు మాట్లాడుతూ
ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలు, ప్రలోభాలు, డబ్బు పంపిణీ, మద్యం సరఫరా సహా నిబంధనల ఉల్లంఘనలు జరగకూడదని ప్రచారానికి అనుమతించబడిన సమయాల్లో మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని
సోషల్ మీడియా పోస్టులు, రవాణా వినియోగం, ప్రచార వాహనాలపై ఉన్న పరిమితులను కచ్చితంగా పాటించాలని
గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అభ్యర్థులు సహకరించాలని సూచించారు.
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించేలా అనుకూల వాతావరణం సృష్టించడం అందరి బాధ్యత అని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.సమన్వయ సమావేశంతో రానున్న ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమన్వయం మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.