– మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
– న్యూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం
వేద న్యూస్, డెస్క్:
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు న్యూ ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియం ఆకాశవాణి కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.