ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:

ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు అడ్డంకిగా మారిని అడక్వాషిని తొలగించి పదోన్నతులు కల్పించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్,నాయకులు గెజ్జెటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపి నాయక్,కొండ లింగయ్య,భాష్య లు కోరారు.ఆదివారం మిర్యాలగూడలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ అడాక్వాషి అనేది పదోన్నతులు అడ్డుకోవడానికేనని చెప్పారు.ఖాళీగా ఏర్పడిన ప్రతి పోస్టులు జనరల్ కేటగిరీ కింద మారతాయని అటువంటి పోస్టులలో పదోన్నతులు ఇచ్చేటపుడు రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని కోరారు.ఈమేరకు ఎస్సీ, ఎస్టీల ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు.సోమవారం తుంగతుర్తి పర్యటనకు వస్తున్న సిఎం దృష్టికి ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు తీసుకవెళ్ళని కోరారు.అవసరమైతే ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ,ఉపాధ్యాయులు సిఎంను కలిసి విన్నవిస్తామని చెప్పారు. సిఎం ప్రత్యేక దృష్టికి సారించి అడక్వాషిని తొలగించి పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.సీఎంకు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక ప్రేమ వున్నదని అడక్వాషి ఉత్తర్వులు రద్దు చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే లు వేముల వీరేశం,మందుల సామెలు, ఎంఎల్సిలు అద్దంకి దయాకర్,కేతావత్ శంకర్ నాయక్ లు అడాక్వాషి రద్దు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని కోరారు.సమావేశంలో ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు మక్లా నాయక్,సైదులు,వడ్డే రాజు, సైదయ్య, జమ్లా నాయక్,బద్దు నాయక్,శంకర్ నాయక్,నెహ్రూ నాయక్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.