- జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ:
నీటి సరఫరా లో అవాంతరాలు లేకుండా చూడాలని జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం ప్రధాన కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు ఆయా డివిజన్ లలో నీటి ఇబ్బందులు తీవ్రం గా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడానికి 66 డివిజన్ లలో ప్రతి డివిజన్ కు సూక్ష్మ ప్రణాళిక (మైక్రో ప్లాన్ ) తయారు చేయాలని అన్నారు.
స్థానికం గా ఉన్న పరిస్థితుల పై అవగాహన ఏర్పరచు కొని తగు పరిష్కార మార్గాలతో సిద్దం గా ఉండాలని, తక్కువ నీరు వచ్చే ప్రాంతాలను (టెయిల్ ఎండ్ )గుర్తించాలని,వేసవి కాలం దృష్ట్యా ఆయా డివిజన్ లలో ఎన్ని చేతి పంపులు ఉన్నాయి? అందులో పనిచేసేవి ఎన్ని? రిపేరింగ్ దశలో ఎన్ని ఉన్నాయో వాటికి సంబందించిన ప్రోగ్రెస్ ఉండాలన్నారు.
2-3 రోజుల్లో మరమత్తులు చేయించి వినియోగం లోకి తీసుకురావాలని,చివరి పాయింట్ వరకు ఉన్న గృహాలకు నీరు అందించాలని ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత ఉండాలని, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వాల్వు ల పనితీరు పరిశీలించాలని ఈ సందర్భం గా కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర ,ఈ ఈ లు శ్రీనివాస్ ,రాజయ్య, డి ఈలు రవికుమార్ ,సంతోష్ బాబు, సారంగం, కృష్ణమూర్తి, రంగారావు, దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.