వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘ భవనంలో అడ్తిదారుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గండ్రపల్లి గ్రామానికి చెందిన (కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు) ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ అర్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం గతంలో కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో మూడోసారి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, తన ఎన్నికకు సహకరించిన అడ్తిదారుల సంఘం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
తమ సంఘ సభ్యులు తనపై పెట్టిన బాధ్యతను విస్మరించకుండా, రాబోయే రోజుల్లో అడ్తిదారులకు ఏ సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తానని రాజేశ్వర్ రావు స్పష్టం చేశారు.
మూడోసారి అధ్యక్షులు ఎన్నికైన రాజేశ్వర్ రావును, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గుత్తి కుమార్, కోశాధికారిగా ఎన్నికైన నవీన్ శ్రీనును సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.