–ఆయన హయాంలో అగ్రగామిగా వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు
– కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా ఎర్రబెల్లిని గెలిపిద్దాం
– ఖాతాదారులకు పూదరి అజయ్ గౌడ్ పిలుపు
వేద న్యూస్, వరంగల్ టౌన్ :
ఈ నెల 21 అనగా రేపు గురువారం జరిగే వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలలో బ్యాంక్ చైర్మన్ గా సేవావాది ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించుకోవాలని ఖాతా దారులను పూదరి అజయ్ గౌడ్ కోరారు. బుధవారం ఖాతాదారులకు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు వృద్ధి కోసం ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేసిన కృషి గురించి వివరించారు. ప్రదీప్ రావు ప్యానల్ ను అధిక మెజారిటీ తో గెలిపించాలని ఈ సందర్భంగా అజయ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తాను చేపట్టే పదవికి వన్నె తెచ్చే విధంగా నిత్యం కర్తవ్య దీక్షతో పనిచేసే నాయకుడు ప్రదీప్ రావు అని వెల్లడించారు.