• ఇల్లందకుంట మండలకేంద్రంలో ఘనంగా పూలే జయంతి

వేద న్యూస్, జమ్మికుంట:
బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి, అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించిన నిత్య స్ఫూర్తిప్రదాత పూలే మహాత్మ జ్యోతిరావు పూలే అని పలువురు పేర్కొన్నారు. గురువారం ఇల్లందకుంట మండలకేంద్రంలో బీసీ సంఘం అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ అధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ భారత దేశ సబ్బండ కులాల సామాజిక మార్పుకోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

పెత్తందారీ వర్గాలను వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడని గుర్తుచేశారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే, సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించేవారని, అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడని పేర్కొన్నారు.

ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపించారని, అందుకోసం 1948 ఆగస్టు లో బాలికల కోసం పాఠశాల స్థాపించాడని వివరించారు. ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా సమాజంలోనీ వెనుకబడిన ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి వారికి ‘మహాత్మ’ బిరుదును కూడా ఇచ్చారని వెల్లడించారు.

కార్యక్రమంలో మొత్కూరి శ్రీ నివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తోడేటి మదు, గైకోటి రాజు, ప్రధాన కార్యదర్శి గడ్డి గోవర్ధన్, గుండారపు సాయి, అన్నం ప్రవీణ్, వంగ రామక్రిష్ణ, పెద్ది కుమార్, శ్రీనివాస్, మొటపోతుల రాము, కల్లెం తిరుపతి రెడ్డి, జక్కు కుమారస్వామి, రావుల వేంకటేశ్, ఏబుషి అజయ్, మొటపోతుల దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.