వేద న్యూస్, మరిపెడ:

ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక   మరిపెడ మండలం స్థాయి చెకుముకి  సైన్స్ సంబురాలను గురువారం నిర్వహించారు.  మండల స్థాయి ప్రతిభా పరీక్షలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన వారిని అభినందించారు. సైన్స్ సంబురాలకు  తహశీల్దార్ సైదులు, ఎంఈఓ అనితా దేవి , గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జీవన్, మరిపెడ మండల జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు బయగాని రామ్మోహన్, ఎస్ఐ సంతోష్ హాజరయ్యారు.  జిల్లాస్థాయికి ఎంపికైన విజేతలు జిల్లాస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.