వేదన్యూస్ -భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరగనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు . ఈరోజు గురువారం జాబ్ మేళా ఏర్పాట్లను సింగరేణి, విద్యుత్ ,మున్సిపాలిటీ అధికారులతో కల్సి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ” ఈనెల ఇరవై ఆరో తారీఖున జరగనున్న ఈ జాబ్ మేళాకు జిల్లా నలువైపులా నుండి దాదాపు పదివేల మంది నిరుద్యోగ యువత హాజరవుతారని భావిస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కర్కి వారి సామార్థ్యాన్ని బట్టి అర్హతను బట్టి కొలువు వస్తుంది.
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సుమారు యాబై వేల సర్కారు ఉద్యోగాలను అందజేశాము . ఈ జాబ్ మేళాకు వచ్చే యువతను దృష్టిలో పెట్టుకుని అనేక ఏర్పాట్లను చేశాము. ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాలను సంపాదించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.