• కురిక్యాల సొసైటీ వద్ద కుప్పకూలిన రైతు
  • యూరియా కోసం రైతుల పడిగాపులు 

 

వేద న్యూస్, గంగాధర :

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే వచ్చి బస్తాల కోసం కాపులు కాస్తున్న రైతులు సాయంత్రం వరకు సరఫరా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తుంటే యూరియా అందక నష్టపోతున్నామని వాపోయారు. ఉదయం 5 గంటల నుంచే సొసైటీ వద్ద కాపులు కాస్తున్నా యూరియా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం కురిక్యాల గ్రామానికి చెందిన రైతు సాయిల్ల రాజమల్లు చాలా సమయం సేపు నిలబడి ఉండడంతో అస్వస్థతకు గురై కిందపడ్డాడు.

స్థానికులు అతన్ని వెంటనే ఆర్‌.ఎం.పి వద్దకు తరలించగా, మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. అనంతరం కరీంనగర్‌కు తరలించారు.

రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తూ యూరియా సరఫరా లోపం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పంటలు పూర్తిగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.