వేద న్యూస్,బోయినిపల్లి:
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్ తో నడిచే పరికరాలు డిస్క్ హారో, నాగళ్ళు, రోటవేటర్లు, విత్తనాలు వేసే యంత్రం, పవర్ వీడర్, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్, గడ్డి చుట్టలు చుట్టే యంత్రం రాయితీ లో ఉన్నాయి. ఈ పథకం లో సన్న చిన్న కారు, మహిళా, ఎస్సి , ఎస్టి రైతులకు 50శాతం రాయితీ, మిగిలిన రైతులకు 40 శాతం రాయితీ కలదు.
ఈ పథకం క్రింద లబ్ధి పొందాలనుకునే రైతులకు కనీసం 1 ఎకరం వ్యవసాయ భూమి ఉండాలి, మట్టి పరీక్ష పత్రం కలిగి ఉండాలి. ఈ పరికరాలు కావాలనుకునే రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, ట్రాక్టర్ పరికరాల కోసం రాక్అర్ సి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో కూడిన దరఖాస్తు ఫారం తో మండల వ్యవసాయ అధికారి కార్యాలయం లో ఈ నెల18 నుండి 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
లబ్ధి దారులను మండల కమిటీ..అనగా.. మండల వ్యవసాయ అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్ కలిసి విధి విధానాలను అనుసరించి ఎంపిక చేస్తారు. ఏమైనా సందేహాలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ అధికారిణి ప్రణీత సూచించారు.