వేద న్యూస్, వరంగల్:
హనుమకొండలోని వడ్డేపల్లి లో నివాసముంటున్న గోపాల్ పూర్ గ్రామ వాస్తవ్యులు, ఆరె కుల ముద్దు బిడ్డ లడే రాజు ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జ్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి,.. సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి, ఆయనకి పూల మొక్క ఇచ్చి, శాలువా తో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ఆదివారం ఘనంగా సన్మానించారు.
కష్టపడి చదివించి ఉద్యోగం సాధించిన రాజుకి, వారి తండ్రి మోహన్ రావుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్,ఆరె కుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మోటె చిరంజీవి, జిల్లా నాయకులు మరియు మాజీ సర్పంచ్ లడే గోపాల్,విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు లడే గుణాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.