వేద న్యూస్, వరంగల్:
జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ గా అవకాశం కల్పించడం తెలంగాణకు గర్వకారణమని, ఆయనకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న ప్రేమకు నిదర్శనం అని జనసేన నేత, నర్సంపేట నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ చార్జి శివ కోటి యాదవ్ తెలిపారు.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమితులైన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి ని శివకోటి యాదవ్ జనసేన లీడర్లతో కలిసి హైదరాబాద్ లోని వారి నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ జనసేన తరఫున జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు గంగుల రంజిత్, బొబ్బ పృథ్వి రాజ్,రొడ్డ శ్రీకాంత్, గాండ్ల అరుణ్, పప్పు రాకేష్, చతరాశి రాజేష్ తదితరులు పాల్గొని మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.