వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నీట్(పిజీ)ఎంట్రన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 2136 సాధించినందుకు గాను ముదుగంటి సాయి దినేష్ రెడ్డి,ని అంబెడ్కర్ గ్లోబల్ మిషన్ ప్రిన్సిఫుల్ మిషన్-ముంబాయి సంస్థ సెక్రటరీ వి.ఎం ఆదిశేష్ సూర్యదేవ్, సుంకపాక చక్రవర్తి, ఆధ్వర్యంలో విలాసాగర్ పాఠశాలలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలుగం శ్రీనివాస్, మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని మన పాఠశాలలో చదివి ఈరోజు నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాడు.విద్యార్థులందరు సాయి దినేష్, ను ఆదర్శంగా తీసుకోని మంచి స్థాయికి ఎదగాలని సూచిస్తూ వారి తల్లిదండ్రులను అభినందించారు.

తదుపరి సుంకపాక చక్రవర్తి, మాట్లాడుతూ దినేష్ రెడ్డి, చాలా సామాన్య కుటుంబంలో పుట్టి వారి తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహంతో నేడు డాక్టర్ గా నీట్ లో ఆల్ ఇండియా 2136 వ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉంది ఇంతటి గొప్ప స్థాయికి వెళ్ళడానికి కృషి చేస్తున్న వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

సన్మాన గ్రహీత సాయి దినేష్ రెడ్డి, మాట్లాడుతూ ఈ రోజు ఈస్థాయికి రావడానికి చిన్ననాటి నుండి నేటి వరకు అక్షరమాలను అందించిన ప్రతి గురువుకు, నా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను, విరందరి ప్రోత్సాహం వలనే ఇంతటి ర్యాంక్ సాధించాను, నా విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాలాగే ఈ పాఠశాలలో చదివే వారు కూడా మంచి స్థాయిలో ఉండాలని సూచించారు.

పాఠశాల చైర్మన్ సుజాత, మాట్లాడుతూ ఈ విజయం గ్రామానికే గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో సాయి దినేష్ రెడ్డి, తల్లిదండ్రులు సుజాత-శ్రీనివాస్ రెడ్డి, గ్రామపెద్దలు,తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.