వేద న్యూస్, హుజురాబాద్/ వీణవంక:
వీణవంక గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పదవి కాలం ముగిస్తున్న – సందర్భంగా పాలకవర్గానికి, సిబ్బందికి గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ కుమారస్వామి పాలకవర్గం గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధి పదానికి సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి, సిబ్బందికి,ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు,ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి అభివృద్ధి పనులు సహకరించారని గ్రామంలో ప్రతి వాడకి వీధి దీపాలతో పాటు డ్రైనేజీ సిసి రోడ్లు డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక నిర్మించడం జరిగిందని తెలిపారు.
గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారం ఎంతో ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచిని పాలకవర్గాన్ని వైస్ ఎంపీపీ దంపతులు సన్మానించారు.
ఈ కార్య క్రమంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్,ఎంపీడీవో శ్రీనివాస్, ఎం పీవో ప్రభాకర్, ఉప సర్పంచ్ భానుచందర్,వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.