వేద న్యూస్, వరంగల్:
జనగాం జిల్లా నుంచి బయలుదేరుతున్న బీసీ ఆజాద్ సైకిల్ యాత్రకు తెలంగాణ కబ్బాడి అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడు సారంగపాణి సంఘీభావం తెలిపారు. యాత్రలో యాక్టివ్ గా పాల్గొంటూ.. టీంను సమన్వయపరుస్తున్న భూపాలపల్లి తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు గునిగంటి విష్ణువర్ధన్ గౌడ్ ను గురువారం శాలువతో ఘనంగా సత్కరించారు.
అనంతరం సారంగపాణి మాట్లాడుతూ ఫిబ్రవరి 2న వరంగల్ లో ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు బీసీ నాయకులే కాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ వందలాదిగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని కోరారు.