వేద న్యూస్, జమ్మికుంట:
సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గండి రంజిత్ కుమార్ గౌడ్ ఎంపిక కావడం పట్ల జమ్మికుంట పట్టణంలోని చాణిక్య, విస్డం కళాశాల యజమాన్యం వారు శాలువా, పూలమాలతో ఆదివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల యజమాని దెబ్బట రవీందర్ మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించడంలో పాటు గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో రాణిస్తూ.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి రంజిత్ తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. సమస్యల పట్ల అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టేలా రజిత్ కృషి చేస్తున్నారని, ఆయన సేవలు అభినందనీయమని వారు కొనియాడారు.

కార్యక్రమంలో విస్డం కళాశాల ప్రిన్సిపల్ విజేందర్ రెడ్డి తో పాటు ప్రభాకర్, మల్లారెడ్డి, రవీందర్, శ్రీనివాస్, సదానందం, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
