- మట్వాడ పీఎస్ వెహికల్స్ పై ఫైన్
- హెల్మెట్ లేకుండా జర్నీ చేసినందుకు..
- రాంగ్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధింపు
- నిబంధనలు ఉల్లంఘించిన ఖాకీ వాహనంపై ఫైన్ విధించడం పట్ల హర్షం
వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
పోలీసైతే ఏంటి..? తప్పదు జరిమానా.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా ఒక్కటే.. భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా మారాయి, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారు ఎవరైనా శిక్షార్హులే . దీనికి నిదర్శనమే వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఫైన్ విధించిన ఘటన.
వరంగల్ మట్వాడ పోలీసు స్టేషన్ కు సంబంధించిన ద్విచక్ర వాహనంపై పోలీసు కానిస్టేబుల్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడంతో రూ. 100 జరిమానా విధించారు. అదే వాహనానికి రాంగ్ పార్కింగ్ చేసినందుకు రూ.100 ఫైన్ విధించారు. మరో పోలీస్ వెహికల్ పైనా కూడా రూ.100 ఫైన్ విధించడం గమనార్హం.
పోలీసు ఉద్యోగికి అది ఖాకీ వాహనానికి.. పోలీసులే జరిమానా విధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంపై మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.