వేద న్యూస్ , గంగాధర:
గంగాధర మండలంలోని మధురనగర్‌లో శనివారం అర్ధరాత్రి ఓ కారుకు మంటలు అంటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక నివాసి మోతె శ్రీహరి రెడ్డి తన కారును ఇంటి పక్కనే పార్క్ చేయగా, రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి వెళ్లిపోయారు. కాసేపటికి మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన కారు యజమాని వెంటనే వాటిని ఆర్పివేశారు.
ఈ సంఘటనపై శ్రీహరి రెడ్డి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని తెలిపారు.