వేద న్యూస్, వరంగల్/ కరిమాబాద్:
కరిమాబాద్ లోని రామస్వామిగుడి శేషగిరి గల్లీ లో కరెంటు పోల్ నుంచి మంటలు చెలరేగా యి. గురువారం రాత్రి కురిసిన “చిరు” వర్షానికి ఒక్కసారిగా .. విద్యుత్ స్తంభం నుంచి మిణుగురులు పెద్ద ఎత్తున విరజిమ్ముతూ కిందికి వచ్చాయి.
10 నిమిషాల పాటు కురిసిన చిరు జల్లు కి కరెంటు పోల్ నుంచి సుమారు రెండు నిమిషాలు మంటలు రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ? అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

