• భోజనం నాణ్యంగా లేదంటున్న విద్యార్థులు
  • కోడి ఈకలు, పాచిపోయిన గుడ్డు వచ్చాయని వాపోతున్న స్టూడెంట్స్ 

వేద న్యూస్, కే యూ:

రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్శిటీ తరువాత రెండో అతిపెద్ద వర్శిటీ కాకతీయ క్యాంపస్ లోనీ విద్యార్థులు అడుగడుగునా సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అనుకున్నా..వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నాణ్యమైన భోజనం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి.

ఇటీవల క్యాంపస్ లోని కామన్ మెస్ లో ఓ విద్యార్థికి అన్నంలో కోడి ఈకలు, మరొకరికి పాచిపోయిన గుడ్డు రావడంతో విద్యార్థులు ఖంగు తిన్నారు. నిత్యం భోజనం అసలు బాగుండటం లేదని ఇదే విషయం పై ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

దీనిపై కొంత మంది విద్యార్థులు స్థానిక మీడియా ను సంప్రదించి సమస్యలను మీడియాకు వివరించారు. భోజనం అసలు తినలేక పోతున్నామని అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. నాణ్యత లోపించిన భోజనం నిత్యం తినడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి.. దీనిపై యూనివర్శిటీ అధికారులు ఎలా స్పందిస్తారో..