వేదన్యూస్ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మాద్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో పంజాగుట్ట ప్రజాభవన్ (ప్రగతి భవన్ ) దగ్గర జరిగిన ఓ కారు ప్రమాదంలో నిందితుడైన తన కుమారుడ్ని తప్పించారనే ఆరోపణలతో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి నుండి పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ తాజాగా తన తల్లి మరణంతో రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.