వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని గాంధి చౌరస్తా వద్ద తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడికౌశిక్ రెడ్డి ఆదేశానుసారం ఘనంగా శుక్రవారం నిర్వహించారు.
జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ టంగుటూరు రాజకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన మహనీయులు కేసీఆర్ అని కొనియాడారు.
కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి, జమ్మికుంట కౌన్సిలర్లు గాజుల భాస్కర్, దయ్యాల శ్రీనివాస్, శ్రీపతి నరేష్, బీఆర్ఎస్ నాయకులు మనోహర్ రావు, లింగారావు, దిలీప్, భోగం వెంకటేష్, గుల్లి రమేష్, ముద్రగడ నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.