వేదన్యూస్ -పాలకుర్తి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలో గెలుపొందితే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సంచలన ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అధికార కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయి.
మిగతా అన్ని చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దమ్ముంటే నిర్వహించి తమ సత్తా చాటాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికలు వచ్చిన ఏ ఎన్నికలు వచ్చిన ప్రజలు ఈసారి బీఆర్ఎస్ కే పట్టం కడతారని మరోకసారి ఉద్ఘాటించారు.