వేదన్యూస్ – తాడేపల్లి గూడెం
ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ” ఆడవాళ్లకు అక్కా కానీ మగవాళ్లకు బావ కానీ మంత్రి నారా లోకేష్ నాయుడుకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి…ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి కనీసం భద్రతను కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ అభిమాన నేత.. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లిగూడెం టీడీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
పిర్యాదు అందుకుని కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై దాడి చేసిన సంఘటనలో సైతం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.