వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైన రూ.10,35,000 నిధులకు సంబంధించిన పనులకు బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా బాయి లింగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గ్రామానికి ముదిరాజ్ రెండు సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామ పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1.35 లక్షల నిధులు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి మంజూరు చేసాడని, మండలంలో ఇంకా వివిధ గ్రామాలకు నిధులు మంజూరు చేసాడని చెప్పారు.
అరవింద్ మాట ఇస్తే తప్పడని మాట మీద నిలబడే నాయకుడని రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.
ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు గెలిపించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి కానుకగా ఇస్తామని అన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రెండు పార్టీలు ప్రజలను మోసం చేసాయని, భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పేద ప్రజలకు ఈ దేశంలో నిలవా నీడలేని ప్రజలు ఉండకూడదని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజురు చేసారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అన్నారు.
ప్రజల కోసం మాట్లాడని బిఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష హోదాలో కూర్చునే హర్హత లేదని 10 సంవత్సరాలు ప్రజలను మాయ మాటలు చెప్పారని, ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని, రానున్న రోజులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్ర అభివృద్ధి చేస్తుందని, ప్రజలందరూ బీజేపీకి అండగా ఉండి బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, వెంకటేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు గుండేటి సతీష్, మండల నాయకులు పుస్తె o రాజారెడ్డి, నరేందర్, మహేందర్, సురేష్, కిరణ్,మహేందర్, ముదిరాజ్ సంఘాల సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.