వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంగళవారం ఫ్రీ ఇన్‌ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. సూర్యా ఫెర్టిలిటీ సెంటర్ ఇందిరా ఐవీఎఫ్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉచిత ఇన్ ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ సంప్రదింపుల శిబిరానికి స్పందన వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.

సుమారు 50 మంది వరకు వచ్చి ఇన్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ భవ్యను కలిసి.. సలహాలు తీసుకున్నారు. పేరెంట్ హుడ్ కోరుకుంటున్న వారికి తగు సలహాలు ఇచ్చినట్టు వైద్యులు వెల్లడించారు.

క్యాంప్‌లో గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ ముషం ప్రణీత, ఇందిరా ఐవీఎఫ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ వారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.