వేద న్యూస్, జమ్మికుంట:

గుండెపోటుతో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. వివరాల్లోకెళితే..ఆబాది జమ్మికుంట కు చెందిన పులాల కుమారస్వామి గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీ వరకు బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహించి.. అనంతరం హుజూరాబాద్ లో కొన్నేండ్ల పాటు సేవలు అందించారు. ఈ సమయంలో ఆయన సర్వీస్ కు  ఎందరో అధికారులు మెచ్చుకున్నారు. అవార్డులు సైతం వరించి వచ్చాయి. 

మున్సిపల్ బిల్లుల వసూలులో రాష్ట్ర స్థాయిలో అవార్డు మున్సిపాలిటీకి రావడంలో తన వంతుగా కుమారస్వామి ఎంతో కృషి ఉన్నదని ఆయన స్నేహితులు పేర్కొన్నారు. కుమారస్వామి గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమన్నారు. కుమారస్వామి పెద్దకర్మలో ఆయన బాల్య మిత్రులు పాల్గొని.. కుటుంబ సభ్యులను ఓదార్చారు.  కొంత ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బత్తిని సది గౌడ్, పూదరి విజయ్ గౌడ్, పంజాల శీను, రాజు ,సారయ్య, రచ్చ గణేష్ సుమన్, బిట్ల రమేష్ అనిల్, శీను, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.