వేద న్యూస్, నల్లగొండ :
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో పురాతన కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర దేవస్థానం క్రికెట్ పోటీలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అట్టహాసంగా ప్రారంభించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. స్నేహపూర్వక క్రీడలు నిర్వహించుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. గత ఏడాది జాతర కంటే ఏడాది జాతర అంబరాన్నoటే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతరను పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సకల వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆమనగల్ శ్రీ రామలింగేశ్వర దేవాలయా జాతరకు పేరు వచ్చే విధంగా కృషిచేస్తానన్నారు. ఆమనగల్ శ్రీరామలింగేశ్వర దేవాలయం జిల్లాలోని పేరుగాంచిన దేవాలయం గా నిలిచింది. గ్రామ ప్రజలు, పార్టీలకు అతీతంగా జాతరకు విజయవంతం చేసేందుకు కృషి చేసేందుకు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆమనగల్ లిఫ్ట్ ఎల్ 21 చైర్మన్ మిర్యాల బిక్షమయ్య క్రికెట్ పరిచయ వేదికగా నిలిచారు. అంతకుముందు కొండ వెంకన్న జ్ఞాపకార్థం కుమారుడు కొండ సాయి ఆమనగల్లు ఫ్రెండ్ షిప్ యూత్ క్రికెట్ జట్టుకు జెర్సీలను అందించారు. దీంతో దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమములో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్, ఆమనగల్లు మాజీ సర్పంచ్ సలహాదారుడు వల్లంపట్ల ప్రవీణ్, ఆమనగల్లు మాజీ ఉపసర్పంచ్ కోల సైదులు, మాజీ దేవాలయ చైర్మన్ బచ్చు వెంకన్న, దేవాలయ ధర్మకర్తలు వాకిటి బిక్షం,కలమ్మ, పెరుమాండ్ల జోజి,యుగంధర్, కాంగ్రెస్ నాయకులు సబ్బు లింగారెడ్డి, వల్లంపట్ల అబ్రహం, మేక మాణిక్యం, వల్లంపట్ల కోటయ్య, మెరుగు జానీ, పెరుమాండ్ల రమేష్, రావుల విజయ్,బంటు సైదులు, నార్ల అజయ్, పెరపాక సతీష్, కొల్లి దిలీప్,ముండ్ల గంగయ్య, వల్లంపట్ల చిన్న ప్రవీణ్ ,నర్సింగోజు ఆచారి, ఎలగపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.