– బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు
వేద న్యూస్, వరంగల్:
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ శాంతియుత పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా 20వ డివిజన్ లోని కాశిబుగ్గ శివాలయం వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదురించి, శాంతియుతంగా స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్ముడు గాంధీ అని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటు పడాలని కోరారు. బాపూజీ ఆదర్శలు, భావజాలం గతంలో కంటే ఇప్పడే మరింత అవసరమని చెప్పారు.

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుతారి గోపి, పైర్ధ ఆనంద్, రత్నం కృష్ణ కిషోర్, తాబేటి వెంకట్ గౌడ్, కొమకుల నాగరాజు, కోట సతీష్, పాషా, కొడాలి రవి, మెరుగు ప్రకాష్, గూడూరు కృష్ణ, చిమ్మని శ్రీకాంత్, కుడికాల కిషన్, గార్దాస్ వినీత్, హరికాల రవి, గోగికర్ క్రాంతి, కడారి నవీన్, సిరివెళ్ల భద్రయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.