వేద న్యూస్, హన్మకొండ:
గ్రేటర్ వరంగల్‌లో  అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుంచి వినాయకుడి కాంపౌండ్ జాగృతి లోటస్ కాలనీ వినాయకుని కాంపౌండ్ వద్దకు.. శనివారం అంగరంగ వైభవంగా యాత్ర జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగమన యాత్ర ప్రారంభోత్సవం జరిగింది.

 

దీనికి జాగృతి కాలనీ నయీమ్ నగర్ లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంచులు విజయకుమార్, కార్యదర్శి బింగి సతీష్ , లోటస్ కాలనీ, జాగృతి కాలనీ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు కర్ర రాజా మల్లారెడ్డి , దోనకొండ రమణారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి , కర్ర రమణారెడ్డి , మాధవ రెడ్డి తదితర ప్రముఖులు, కాలనీవాసులందరూ ప్రత్యేకంగా పాల్గొన్నారు. మహిళలు ఆడి పాడుతూ స్వాగతం పలికారు. చిన్నారులు కూడా కోలాటాలతో ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.