- ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా, వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎస్పీ తెలియజేశారు.
ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని,శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్.ఐ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.