వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వినాయక చవితిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో గణేశ్ మహరాజ్‌ను ప్రతిష్టించారు. ఆస్పత్రి వైద్యులు ఈ సందర్భంగా మూషిక వాహనుడు, లంభోదరుడు .. బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ బాగుండాలని, అందరికీ సిద్ధి, బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంజీవని ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఊడుగుల సురేశ్, డాక్టర్ ఊడుగుల అనిత, డాక్టర్ ముషం సురేశ్, డాక్టర్ ముషం ప్రణీత, డాక్టర్ కె.కిశోర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.