వేద న్యూస్, ఆసిఫాబాద్:
ఆసిఫాబాద్ మండలంలోని బురుగుడా గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గీత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయ పూజారి రంగన్న స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవత్ గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
