వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పరిధిలోని వావిలాల గ్రామంలోని ఆదర్శ బాలసదన్ ఉన్నత పాఠశాలలో 1998-1999 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ ‘నాటి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పాఠశాలలో గెట్ టు గెదర్ ద్వారా మళ్లీ కలిశారు. ఈ అ ‘పూర్వ’ కలయికకు పాఠశాల వేదిక కాగా, ఉపాధ్యాయులను విద్యార్థులను సన్మానించడం విశేషం.
‘బాల సదవ్ – బడి సోపతుల అపూర్వ కలయిక’ పేరుతో జరుపుకున్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తమ తమ మధుర జ్ఞాపకాలను అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని చెప్పారు. చదువుకునే రోజులు, చేసే అల్లరి, వారితో కలిసి అడినఆటలు, పాడిన పాటలు, చిన్న చిన్న గ్యాంగ్ లు, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, అవన్నీ ఓ మధురమైన జ్ఞాపకలని వెల్లడించారు. తమకు పాఠాాలు చెప్పిన ఆచార్యులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. తమ విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకుని, మరోసారి కలుసుకోవడం ఆనందం కలిగించిందని ఉపాధ్యాయులు వెల్లడించారు.
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వీరగోని రాజయ్య, ప్రధానోపాధ్యాయులు తోడేటి సధాకర్, నరేందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చంద్ర కిరణ్, మహేష్ రెడ్డి, శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు బండారి శ్రీనివాస్, ఆనపల్లి రంజిత్, తోట రాజు, శంకర్, వూర అంజలి, కందుల శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తతే మేలు.. ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్