వేద న్యూస్, సూర్యపేట ప్రతినిధి :

సూర్యాపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్ అంజలి స్కూల్ ప్రక్కన గల లక్ష్మి డాల్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ వరల్డ్ షాపును మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మరియు పిల్లలకు యువతకు అత్యాధునిక నాణ్యతతో కూడిన పిల్లల ప్రపంచం అంటే వారికి నచ్చిన వస్తువులు రకరకాల డాల్స్ ఫోటో ఫ్రేమ్స్ కిచెన్స్ మగ్గులపై ప్రింటింగ్ టీ షర్ట్ ప్రింటింగ్ రకరకాల వస్తువులు ఫ్యాన్సీ ఐటమ్స్ పట్టణ ప్రజలకు అందుబాటులో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సూర్యాపేట పట్టణంలోని నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంచారని తెలియజేశారు.

యువత ఉద్యోగాలు రాకున్నా వ్యాపార రంగంలో రాణించి అభివృద్ధి చెందాలని సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు భిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, షాప్ నిర్వాహకులు ఆమనగంటి గణేష్, భిఆర్ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మట్ట రాజు యాదవ్, ఆకుల లవకుశ, సందీప్ నాయుడు, సోమయ్య, నాగలక్ష్మి, రాము, సాయి, నరేష్, మల్లయ్య, శంకర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.