- 23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే..
- పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్
- హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు
వేద న్యూస్, గోషామహల్:
గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న ఉద్యమ నేత, గులాబీ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ వీ మహేందర్ కుమార్ కు అధిష్టానం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా చాన్స్ ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
ఇంతవరకు ‘గులాబీ’ పార్టీ నాయకుడిగానే ఉండి..ఏ పదవులు ఇవ్వకున్నా ఒకే పార్టీలో ఉంటూ పార్టీ పట్ల తనకున్న నిజాయితీని, కమిట్మెంట్ను చాటుకుంటూ వస్తున్న ఆర్.వీ.మహేందర్ కుమార్ కు ‘గులాబీ’ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించాలని క్షేత్రస్థాయిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, ఆర్ వీ మహేందర్ అనుయూయులు అడుగుతున్నారు.
గోషామహల్ నియోజకవర్గ పరిధితో పాటు హైదరాబాద్ ప్రజలకు సుపరిచితులైన ఆర్ వీ మహేందర్ ను బరిలో దింపాలని అంటున్నారు.