- ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయిని అభ్యర్థన
వేద న్యూస్, హనుమకొండ:
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వాలని ఆ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చౌక ధరల దుకాణంలో 11 రకాల సరుకులు వచ్చేవని, నేడు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేద ప్రజలకు ఉచితంగా రేషన్ కార్డులు ఇచ్చి ఆదుకుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఉన్నత చదువులు చదువుకోవటానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వివరించారు.
మనం కలలుగన్న తెలంగాణ సాకారినికి కాంగ్రెస్ కు ఓటెయ్యాలని జనాన్ని ఆయన కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంజయ్ జాగీదార్, సయిండ్ల శ్రీకాంత్, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, తోట పవన్, మంద రాకేష్ తదితరులు పాల్గొన్నారు.