వేదన్యూస్ – ఫిల్మ్ నగర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారానే తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ అందుబాటులో ఉంది.
సెలబ్రేటీలు ఎక్కువగా వాడే ట్విట్టర్ ( ఎక్స్)లో ఈ హాట్ బ్యూటీ గత కొంతకాలం నుండి యాక్టీవ్ గా లేరు. తాజాగా ఈ భామ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే సమంతకు ఎక్స్ లో కోటి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరోవైపు సమ్ము నిర్మాతగా మారిన సంగతి కూడా మనకు ఎరుకనే.
ట్రాలాలా మూవింగ్ ఫిక్చర్స్ పేరుతో ఆమె సొంతగా ప్రోడక్షన్స్ హౌస్ ఏర్పాటు చేసుకుంది.తన సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన శుభం మూవీని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అమ్మడు తన ఎక్స్ లో పోస్టు చేశారు.హర్రర్ మూవీగా తెరకెక్కుతుంది . తాజాగా సమంత ట్విట్టర్ లో యాక్టివ్ కావడంతో అభిమానులు హ్యపీగా ఫీలవుతున్నారు.