Revanth Reddy AnumulaRevanth Reddy Anumula

వేదన్యూస్ – హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై శుభవార్తను తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖుతో గడవు ముగిసిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ రిజిస్ట్రేషన్ గడవును ఏఫ్రిల్ నెల ముప్పై తారీఖు వరకూ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు బుధవారం జారీ చేసింది. ఈ నెల ముప్పై తారీఖు వరకూ ఇరవై శాతం డిస్కౌంట్ తో ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్లను క్రమబద్ధీకరించింది.

దీని ద్వారా ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది. తాజాగా రాష్ట్రంలో ఉన్న పలు పురపాలక పరిధిలో మొత్తం 15.27 లక్షల దరఖాస్తులు  వచ్చాయి. అయితే వీటిలో అధికారులు రూల్స్ ప్రకారం లేవని   15,894 దరఖాస్తులను  తిరస్కరించారు. ఇంకోవైపు  6. 87లక్షల దరఖాస్తులు ప్రాసెస్ అయ్యాయి..