•  అందుబాటులో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు చక్కటి వైద్య సేవలందిస్తున్నారు. జనం డయాలసిస్ కోసం వరంగల్, కరీంనగర్, హనుమకొండ , హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంటలోని సంజీవని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సదరు ఆస్పత్రిలో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు అందిస్తున్నట్టు ఎండీ జనరల్ ఫిజీషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఊడుగుల సురేశ్, ఎంఎస్ జనరల్ సర్జన్‌, ఎఫ్ఎంఏఎస్ డాక్టర్ అనిత ఊడుగుల తెలిపారు.

 

హెల్త్‌పై ఫోకస్ మస్ట్
దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా కిడ్నీ సమస్యలున్న పేషెంట్స్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాని డాక్టర్ ఊడుగుల సురేశ్, డాక్టర్ ఊడుగుల అనిత వెల్లడించారు.

 

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బీపీ, షుగుర్ సమస్యలు వస్తున్నాయని.. ఫలితంగా కిడ్నీల మీద వాటి ప్రభావం పడే అవకాశాలు ఉంటున్నాయని చెప్పారు. అవి కంట్రోల్ దాటి ప్రభావం చూపితే డయాలసిస్ వరకు పేషెంట్స్ వెళ్లే ప్రమాదముంటుందని తెలిపారు.

ఎవరైనా సరే అనారోగ్య సమస్య వస్తే సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమమని స్పష్టం చేశారు.

ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, యాంటీ బయాటిక్స్ మాత్రలు సొంతంగా వాడటం మంచిది కాదని డాక్టర్ సురేశ్ చెప్పారు.