• సేవావాది తూడి లచ్చన్న.. సుకన్య సమృద్ధి యోజన  కింద ఆడపిల్లలకు రూ.5016 జమ

వేదన్యూస్, గంగాధర:

 

ఆడపిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం లో గంగాధర మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఆడపిల్లల పేర్ల పైన సేవావాది తూడి లచ్చన్న..  తన స్వంత డబ్బులతో రూ.5016 పోస్టాఫీసు లో జమ చేసి గురువారం వారి తల్లిదండ్రులకు పత్రాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ,

“ఆడపిల్ల అంటే ఆదిశక్తి. కొంతమంది ఇప్పటికీ ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు. అలాకాకుండా వారిని అదృష్ట లక్ష్మిలా చూడాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు విద్య, క్రీడలు, పరిశ్రమలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పైలట్‌లు, ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొంటున్న మహిళలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు అని తెలిపారు . ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఆడపిల్లల భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడతాయి,” అని పేర్కొన్నారు.

ఈ పథకం చిన్నతనంలోనే ఆడపిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించి, వయస్సు పెరిగే సరికి వారికి మంచి పొదుపు ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

తల్లిదండ్రులు దీనిని ఉపయోగించుకొని తమ కూతుళ్లకు భవిష్యత్తులో విద్య, వివాహానికి అవసరమైన ఖర్చులను తేలికగా భరించగలరని వివరించారు.

లబ్దిదారులు పథకం వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు మంచి స్థిరత ఏర్పడుతుందని, తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు