వేద న్యూస్, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన వచ్చింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోను భూమయ్య తెలియజేసారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తల్లి దండ్రులు మమ్ములను నమ్మి పాఠశాల కు పంపుతున్నారని విద్యార్థులను ఉత్తమ పౌరులు గా తీర్చి దిద్ది తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెడుతామని తెలియజేసారు. ప్రైవేటు పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన అందజేస్తామని వారి భవిష్యత్తు రూపకల్పనే ధ్యేయంగా పనిచేస్తామని అనంతరం పేరెంట్స్ తరుపున కొందరు దాతలు విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ అందజేశారు.
వారికి పాఠశాల యాజమాన్యం తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. అలాగే ఈ పాఠశాల నుండి బాసర ఐఐటీకి ఎంపికైన విద్యార్థిని కావ్య ను ఘనంగా సన్మానించారు.