• మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ముఖ్య సభ్యుల సమావేశం
  • జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి
  • మున్నూరు కాపు సంఘం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/సోమాజిగూడ:

జనాభా ప్రాతిపాదికన అసెంబ్లీ సీట్లు కేటాయించాని, మున్నూరు కాపు సంఘం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ముఖ్య సభ్యులు కోరారు. ప్రత్యేకంగా ఈ రెండు ఎజెండాలతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మున్నూరు కాపు సంఘం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆ సంఘం చందానగర్, పటాన్ చెరువు కార్యవర్గ, కార్యనిర్వాహక సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ పటేల్, కార్యనిర్వాక కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షులు దేశెట్టి శివ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ దేవయ్య పటేల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తాను మున్నూరు కాపు సంఘానికి, వ్యక్తిగత వ్యాపారాలను, తన కళను పక్కనబెట్టి..మున్నూరు కాపు సంఘానికి రావలసిన, కావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాం చేస్తోన్నానని చెప్పారు. ఈ ఉద్యమంలో తనతో పాటు తన కుల సోదరీ సోదరీమణులు ఎంతోమంది ముందుకు వస్తున్నారని తెలిపారు. మన అందరి లక్ష్యంలో ఒకటే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేదేనని, దానికి ఏటా రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపాదికన అన్ని పార్టీలు 15 నుంచి 18 సీట్లను కేటాయించాలని లేదా జిల్లాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ను అయిన కేటాయించాలని కోరారు. రాష్ట్రసర్కార్ కేటాయించిన రూ. 5 వేల కోట్లతో పాటు ఐదు ఎకరాల భూమితో పాటు మరొక 25 కోట్ల రూపాయలు భవన నిర్మాణ పనులకు పనుల కోసం కేటాయించాలన్నారు.

తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డాక్టర్ కొండా దేవయ్య పటేల్ చేస్తున్న ఈ ఉద్యమాన్ని చూసి తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు మన వారి వైపు చూస్తూ ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మన వారందరినీ ఏక తాటిపైకి తీసుకువచ్చి నెక్లెస్ రోడ్ జల్వాయి విహార్‌లో గొప్పగా ప్లీనరీని నిర్వహించారని గుర్తుచేశారు.

మన రాష్ట్రం వారినే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళుతూ..మున్నూరు కాపు ఐక్యత కోసం పాటుపడుతున గొప్ప వ్యక్తి మన డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అని కొనియాడారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న గోషామహల్ అసెంబ్లీ టికెట్‌ను సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్ వీ మహేందర్ పటేల్ కు కేటాయించాలని కోరారు.