మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
వేద న్యూస్, మహబూబ్‌నగర్ :
దేవరకద్ర భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని ఆదివారం కలిసి సోమవారం చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మల్లెల బాలరాజునీ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సూచించినందుకు ఆయనను బలపరిచి నట్లు మల్లెల మీడియా ముందు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మల్లెల బాలరాజుని గెలిపించుకొని రావాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ గౌడ్,శ్రీనివాసులు, అంజన్న, వెంకటేష్,బాలకృష్ణ, నవీన్, వేణు, పద్మ, ఝాన్సీ, రాణి తో పాటు తదితరులు పాల్గొన్నారు.